CEC Visits : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ఫోకస్
వచ్చే వారం సందర్శించనున్న సీఈసీ
CEC Visits : దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే కర్ణాటక, త్రిపుర , మేఘాలయలలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది బీజేపీ. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించనుంది. ఈ మేరకు వచ్చే వారం ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది.
అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుసుకుంటుంది. అన్ని వాటాదారుల భాగస్వామ్యంతో ఎన్నికలను నిర్వహించేందుకు వారి అభిప్రాయాలను కోరుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ జనవరి 11 నుంచి మూడు ఈశాన్య రాష్ట్రాలలో సందర్శించనున్నారు(CEC Visits). ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆయనతో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ తో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా ఉంటారు. వీరితో పాటు సీనియర్ అధికారులు త్రిపురకు వస్తారని త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసీర్ గిట్టే కిరణ్ కుమార్ దినక్ రావు వెల్లడించారు.
ఎన్నికల పరిశీలనలో భాగంగా త్రిపురలో రెండు రోజుల పాటు ఉంటారు. అక్కడే బస చేస్తారు సిఇసీ, ఇతర ఇద్దరు ఈసీలు రాబోయే ఎన్నికల సన్నద్దతను సమీక్షించేందుకు సీనియర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అగర్తల నుండి ఎన్నికల సంఘం జనవరి 12న మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు , జనవరి 14న నాగాలాండ్ కు వెళ్లి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుంది.
ఆయా రాష్ట్రాలను పర్యటించిన అనంతరం తిరిగి ఢిల్లీకి వస్తారు.
Also Read : జన హితం పాదయాత్ర లక్ష్యం