Sharad Pawar : మహిళా కోటా బిల్లుపై కేంద్రం వివక్ష – పవార్
ఇదంతా ఉత్తర భారత దేశ మనస్తత్వం
Sharad Pawar : ఈ దేశంలో నరేంద్ర మోదీ(PM Modi) బీజేపీ ప్రభుత్వం కొలువు తీరాక మహిళల పట్ల వివక్ష మరింత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.
ప్రధానంగా మహిళా సాధికారత అంటూనే ఇంకో వైపు మహిళల కోటా కోసం పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీ ఉన్నా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.
మహారాష్ట్రలోని పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమలో తన కూతురు ఎంపీ సుప్రియా సూలే తో కలిసి ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం పవార్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి బీజేపీలో. ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే మహిళల భాగస్వామ్యం అత్యవసరమని స్పష్టం చేశారు.
కానీ మోదీ పైకి చెప్పేది ఒకటి లోపట చేసేది మరోటి అంటూ ధ్వజమెత్తారు. మహిళా కోటా బిల్లు ఆమోదం పొందేంత వరకు అన్ని పార్టీలు ప్రయత్నం చేయాలని కోరారు శరద్ పవార్(Sharad Pawar).
లోక్ సభ , అన్ని రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇంకా ఆమోదం పొందక పోవడం దారుణమన్నారు.
ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు శరద్ పవార్(Sharad Pawar). తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచీ మహిళా బిల్లు కోసం ప్రశ్నిస్తూనే ఉన్నానని వారి పక్షాన మాట్లాడుతున్నానని కానీ ఫలితం లేకుండా పోతోందని ఆవేదన చెందారు.
తాను మరాఠాకు సీఎంగా ఉన్న సమయంలో మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాను. మొదట వ్యతిరేకించారు ఆ తర్వాత ఒప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read : పీకే స్ట్రాటజిస్ట్ కాదు పక్కా వ్యాపారవేత్త