Centre Cancels RGF : రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కు కేంద్రం షాక్

ఫారిన్ కంట్రిబ్యూష‌న్ లైసెన్స్ ర‌ద్దు

Centre Cancels RGF : కాంగ్రెస్ పార్టీలోని గాంధీ ఫ్యామిలీకి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది మోదీ ప్ర‌భుత్వం. ఈ మేర‌కు సంస్థ‌కు సంబంధించి ఫారిన్ కంట్రిబ్యూష‌న్ లైసెన్స్ (ఎఫ్సీ ఆర్ ఏ) ను ర‌ద్దు చేసింది.

గాంధీ కుటుంబానికి చెందిన స్వ‌చ్చంధ సంస్థ‌ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపేందుకు 2020 లో హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంత‌ర్ మంత్రిత్వ క‌మిటీ ప‌రిశోధ‌న‌ల త‌ర్వాత ఈ చ‌ర్య తీసుకుంది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కు సార‌థ్యం వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా గాంధీ ఫ్యామిలీకి చెందిన ప్ర‌భుత్వేత‌ర సంస్థ‌లు రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ (ఆర్జీఎఫ్‌) , రాజీవ్ గాంధీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ (ఆర్జీసీటీ) ల‌లో విదేశీ విరాళాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్ ను(Centre Cancels RGF) కేంద్రం ర‌ద్దు చేసింది.

ఇదిలా ఉండ‌గా ఆర్జీఎఫ్, ఆర్జీసీటీల‌లో జ‌రిగిన అవ‌క‌త‌క‌ల‌పై ద‌ర్యాప్తును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

సోనియా గాంధీ ఆర్జీఎఫ్ కు సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబ‌రం స‌భ్యులుగా ఉన్నారు.

ఇక రాజీవ్ గాంధీ ఛారిట‌బుల్ ట్రస్ట్ కు కూడా సోనియా గాంధీ చీఫ్ గా ఉన్నారు. రాహుల్ గాంధీ, రాజ్య‌స‌భ మాజీ ఎంపీ డాక్ట‌ర్ అశోక్ ఎస్. గంగూలీ స‌భ్యులుగా ఉన్నారు.

Also Read : పార్టీల‌కు ముస్లింలు ఏటీఎం యంత్రాలు

Leave A Reply

Your Email Id will not be published!