Kiren Rijiju : న్యాయ వ్యవస్థకు కేంద్రం సహకారం – రిజిజు
కేసుల పరిష్కారం కోసం ప్రయత్నం
Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) సంచలన ప్రకటన చేశారు. దేశంలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయ సహకారాలు అందజేస్తోందని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా కోర్టులను సన్నద్దం చేసేందుకు తాము చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగలేదన్నారు.
దేశంలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు కిరెన్ రిజిజు. హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్శిటీలో నిర్వహించిన భారతీయ ఆదివక్త పరిషత్ మూడు రోజుల 16వ జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇదిలా ఉండగా ఆయన మీడియాపై మండిపడ్డారు.
అంతే కాదు ఆయా రాజకీయాల పార్టీలను కూడా టార్గెట్ చేశారు. గత కొంత కాలంగా తనపై , కేంద్ర సర్కార్ పై బురద చల్లేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). ప్రధానంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు న్యాయ వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అగాధం ఉందన్న రీతిలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఆధారాలు లేకుండా ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రచురుణ, ప్రసార మాధ్యమాలు కూడా ఏదో జరిగి పోతోందంటూ ప్రసారం చేస్తుండడం దారుణమన్నారు. న్యాయ వ్యవస్థపై తాము పెత్తనం చెలాయిస్తున్నట్లు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు కిరెన్ రిజిజు.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి దాకా దేశాన్ని నడిపే విషయంలో రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పరిగణిస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి.
Also Read : చరిత్ర వక్రీకరణ దేశానికి ప్రమాదం – స్టాలిన్