Union Budget 2023 : అఖిలపక్షంతో కేంద్రం కీలక భేటీ
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
Union Budget 2023 : జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జనవరి 30 సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఇందులో ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ , పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరు కానున్నారు.
ప్రధాన అంశాలపై చర్చించనుంది అఖిలపక్షంతో . బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఉభయ సభలు లోక్ సభ, రాజ్య సభ సజావుగా సాగేందుకు సహకారం ఇవ్వాలని కోరనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వచ్చే ఏడాది 2024లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్(Union Budget 2023) ఇదే కావడం విశేషం. ఈసారి జనాకర్షక బడ్జెట్ ఉండనుందని ఆర్థిక వర్గాల అంచనా. సామాన్యులపై భారం పడకుండా వ్యాపారవేత్తలకు నష్టం వాటిల్లకుండా మధ్యే మార్గాన్ని అనుసరించనుంది కేంద్ర సర్కార్. ఈ మేరకు బడ్జెట్ ను తయారు చేసే పనిలో పడింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
ఇప్పటికే ఫైనల్ అయిందని ఇక ప్రవేశ పెట్టడమే మిగిలిందని సమాచారం. జనవరి 31న బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ప్రపంచ మీడియా సంస్థ బీబీసీ ఇటీవల ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది.
మరో వైపు ఎల్ఐసీ, ఎస్బీఐ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి అదానీ గ్రూపులో. వీటిని విపక్షాలు ప్రత్యేకంగా ప్రస్తావించనున్నాయి.
Also Read : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరు