Manipur Violence : మణిపూర్ లో హింసపై కేంద్రం ఫోకస్
ఆర్మీ చీఫ్, అమిత్ షా గవర్నర్ తో భేటీ
Manipur Violence : మణిపూర్ లో హింస కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండ్యా సందర్శించారు. అక్కడ శాంతి నెలకొనేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్మీని ఆదేశించారు. అంతకు ముందు రెండు రోజుల పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. గవర్నర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరా తీశారు. త్వరలోనే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా సైతం మణిపూర్ హింస(Manipur Violence) పై ఫోకస్ పెట్టారు.
సాధ్యమైనంత త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఆర్మీని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర సర్కార్ సైతం చర్యలు చేపట్టింది. ప్రజలు స్వచ్చంధంగా తమ ఇళ్లకు వెళ్లేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశానికి చెందిన సాయుధ దళాలన్నీ మణిపూర్ కు చేరుకున్నాయి. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. మణిపూర్ లో హింసను కంట్రోల్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
ఆయన సమాజంలోని అన్ని వర్గాలతో మాట్లాడుతున్నారు. హింసాత్మక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మణిపూర్ కు చేరుకున్న షా 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన జాతి ఘర్షణలో పాల్గొన్న మైతే ,కుకీ రెండు వర్గాలకు చెందిన సభ్యులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
Also Read : Rahul Gandhi