AP High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కామెంట్స్
ఆ ప్రతిపాదన పెండింగ్ లో లేదు
AP High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టును అమరావతి నుంచి తరలించే ప్రతిపాదనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తరలించే ప్రతిపాదన తమ వద్ద పెండింగ్ లో లేదని స్పష్టం చేసింది. హైకోర్టు(AP High Court) తరలించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ తలారి రంగయ్య పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు పై విధంగా ప్రభుత్వం సమాధానం చెప్పింది.
AP High Court Shifting
మరోసారి కీలక ప్రతిపాదన చేసింది కేంద్రం. ముందు వైసీపీ సర్కార్ , హైకోర్టు కలిసి పూర్తి స్థాయిలో ప్రతిపాదన పంపితే కేంద్ర సర్కార్ పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా త్వరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు రాజధానులు ప్రకటించారు. కేపిటల్ సిటీగా విశాఖ పట్టణం చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో హైకోర్టును అమరావతి నుంచి తరలించే ప్రతిపాదన ఉందన్నారు. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ వద్ద అలాంటి ప్రతిపాదనే లేనప్పుడు వేరే దాని గురించి ఎందుకు ఆలోచిస్తామంటూ మండిపడింది.
Also Read : Congress Join : కాంగ్రెస్ లో భారీగా చేరికలు