Polavaram Issue : పోల‌వ‌రంపై కేంద్రం స‌మావేశం

నాలుగు రాష్ట్రాల‌తో వ‌ర్చువ‌ల్ మీటింగ్

Polavaram Issue : పోల‌వ‌రం స‌మ‌స్యకు ప‌రిష్కారం క‌నుగొనేందుకు కేంద్రం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ నాలుగు వాటాదారుల వ‌ర్ఛువ‌ల్ స‌మావేశాన్ని నిర్వ‌హించింది. పోల‌వ‌రం బ‌హుళార్ధ‌క సాధ‌క ప్రాజెక్టుకు(Polavaram Issue) సంబంధించిన స్టేక్ హోల్డ‌ర్ రాష్ట్రాలతో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మీక్షించింది.

ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ , ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించి పోల‌వ‌రం స‌మస్య‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది స‌ర్వోన్న‌త భార‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు.

ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల‌తో వెంట‌నే స‌మావేశం ఏర్పాటు చేసి ప‌రిష్కార మార్గం క‌నుగొనాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేర‌కు కేంద్రంలో క‌ద‌లిక వ‌చ్చింది. పోల‌వ‌రంపై ఆయా రాష్ట్రాలు వాటాదారులుగా ఉన్న‌ప్ప‌టికీ ఏ ఒక్క రాష్ట్రంతో మ‌రో రాష్ట్రం అవ‌గాహ‌న‌కు రావ‌డం లేదు. దీని బాధ్య‌త‌ను కేంద్రం త‌న భుజాన వేసుకుంది.

స్టేక్ హోల్డ‌ర్ల రాష్ట్రాలతో మీటింగ్ ఏర్పాటు చేయాల‌ని ఈనెల మొద‌ట్లో సుప్రీం స్ప‌ష్టం చేసింది. జ‌ల శ‌క్తి మంత్రిత్వ శాఖ‌, ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ ద్వారా మార్గ‌ద‌ర్శ‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ చైర్మ‌న్ ఆర్కే గుప్తా మాట్లాడారు. పోల‌వ‌రం డ్యామ్(Polavaram Issue) నిర్మాణం గోదావ‌రి జ‌ల వివాద ట్రిబ్యున‌ల్ తీర్పును ఉల్లంఘించ‌ద‌న్నారు. ప్రాజెక్టు డిజైన్ కు కేంద్రం ఆమోదం తెలిపాకే ప్రాజెక్టు నిర్మాణం చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : కృష్ణంరాజు జ్ఞాప‌కార్థం స్మృతి వ‌నం

Leave A Reply

Your Email Id will not be published!