Centre Nominates : దిగ్గజాలకు కేంద్రం అరుదైన గౌరవం
నలుగురు ప్రముఖులకు రాజ్యసభ చాన్స్
Centre Nominates : కేంద్రంలో నరేంద్ర మోదీ(PM Modi) నాయకత్వంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత దేశాన్ని తమ ప్రతిభా సంపత్తితో వేలాది మందిని ప్రభావితం చేస్తూ వచ్చిన వివిధ రంగాలకు చెందిన నలుగురికి అత్యున్నతమైన పెద్దల సభ (రాజ్యసభ)కు నామినేట్(Centre Nominates) చేసింది.
ప్రస్తుతం మోదీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. నలుగురు ప్రముఖులను నామినేటన్ చేసింది.
వారిలో దిగ్గజ సంగీత దర్శకుడిగా పేరొందిన ఇళయరాజా, పరుగుల రాణి పీటి ఉష, ప్రముఖ రచయిత, దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు కర్ణాటక నుంచి పరోపకారి వీరేంద్ర హెగ్డే లను రాజ్యసభకు ఎంపిక(Centre Nominates) చేసింది కేంద్రం.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీరిని అభినందించారు. ఆయన ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా రచయితగా సేవలు అందిస్తూ వచ్చారని తెలిపారు.
వీరేంద్ర హెగ్డే గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశిష్టమైన సమాజ సేవలో ఆయన ముద్ర అసమాన్యం. ధర్మస్థల ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం నాకు లభించంది.
ఆరోగ్యం, విద్య, సంస్కృతిలో ఆయన చేస్తున్న గొప్ప పనిని కూడా దగ్గరుండి చూశానని తెలిపారు. ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆయన రారాజు. ఆయన నిరాడంబర జీవితం ఎప్పటికీ స్పూర్తి దాయకమేనని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్దమాన క్రీడాకారులకు పీటీ ఉష స్పూర్తి దాయకంగా ఉన్నారు.
Also Read : రాజ్యసభకు నామినేట్ పీటీ ఉషకు పీఎం కంగ్రాట్స్