Centre Probes 4 Syrups : దగ్గు సిరప్ లపై కేంద్రం దర్యాప్తు
గాంబియాలో 66 మంది పిల్లల మరణాలు
Centre Probes 4 Syrups : కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లల మరణాలకు కారణమైన సిరప్ లపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు.
దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సిరప్ లను హర్యానకు చెందిన ప్రముఖ మందుల సంస్థ తయారు చేసింది. నాలుగు సిరప్ లను(Centre Probes 4 Syrups) వాడడం వల్ల పిల్లలకు సంబంధించి కిడ్నీలపై ప్రభావం, ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీసిందని ప్రకటించారు. ఈ సిరప్ లను వాడడం వల్ల ఇప్పటి వరకు 66 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సిరప్ లు వాడ వద్దంటూ సూచించింది. గాంబియాలో పిల్లల మరణాలపై డబ్ల్యుహెచ్ఓ తీవ్రంగా హెచ్చరించింది. దీంతో హర్యానాకు చెందిన ఫార్యాస్యూటికల్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు సిరప్ లపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.
దగ్గు సిరప్ ల గురించి డబ్ల్యూహెచ్ఓ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ )ని హెచ్చరించిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
లోని ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెంటనే హర్యానా రెగ్యులేటరీ అథారిటీతో ఈ
విషయాన్ని తీసుకు వెళ్లింది.
సోనెపట్ లోని ఎంఎస్ మైడెన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గాంబియాకు సరఫరా చేసినట్లు
విచారణలో వెల్లడైంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రోమోథాజైన్ ఓరల్ సొల్యూషన్ , కోఫెక్స్ మలిన్ బేబీ కఫ్ సిరప్ , మాకోఫ్ బేబీ కఫ్ సిరప్ ,
మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ లను అనుమానం వ్యక్తం చేసింది.
Also Read : భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ