Centre Release : పోల‌వ‌రంకు రూ. 12,911 కోట్లు మంజూరు

అంగీకారం తెలిపిన కేంద్ర ప్ర‌భుత్వం

Centre Release : ఎట్ట‌కేల‌కు ఏపీ సీఎంకు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది కేంద్రం. ఈ మేర‌కు ఆయ‌న చేసిన కృషి ఫ‌లించింది. తాజాగా కేంద్రం ఏపీలోని పోల‌వ‌రం ప్రాజెక్టు(Polavaram Project) నిర్మాణం వేగ‌వంతం అయ్యేందుకు గాను రూ. 12,911 కోట్లు మంజూరు చేసేందుకు అంగీక‌రించింది. మంజూరైన రూ. 12,911 కోట్ల‌లో రూ. 2,000 కోట్లు గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన డ‌యా ఫ్రమ్ వాల్ నిర్మాణం లోప భూయిష్టంగా ఉండ‌టం వ‌ల్ల అద‌న‌పు ఖ‌ర్చు అయ్యింద‌ని దీనికి కూడా మంజూరు చేసింది.

ఈ నిధులు పూర్తిగా పోలవ‌రం ప్రాజెక్టు మొద‌టి ద‌శ పూర్తి చేసేందుకు మంజూరు చేసిన‌ట్లు ఏపీ స‌ర్కార్ వెల్ల‌డించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని ఏపీ స‌ర్కార్ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. కేంద్రంతో ముఖ్య‌మంత్రి చేస్తున్న అలుపెర‌గ‌ని ప్ర‌య‌త్నాలు, చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ఫ‌లితమే ఈ నిధులు మంజూరు అయిన‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

ప్రాజెక్టు జాప్యానికి కార‌ణం అవుతున్న బిల్లుల స‌మ్మేళ‌నం చెల్లింపు నుండి మిన‌హాయింపును అందించ‌డంతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మెమోరాండంను కేంద్ర జ‌ల వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు పంపిన‌ట్లు తెలిపింది. మంగ‌ళ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు. ప‌నుల ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించారు. ప‌నులు త్వ‌ర‌గా అయ్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : Imran Khan Pak Army : ఖాన్ క‌వ‌రేజీపై ఉక్కుపాదం

Leave A Reply

Your Email Id will not be published!