Centre Serious : గృహ నిర్మాణ నిధులపై కేంద్రం గుస్సా
ఏపీ ప్రభుత్వ నిర్వాకంపై సీరియస్
Centre Serious : కేంద్ర సర్కార్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 1,309 కోట్ల రూపాయల గృహ నిర్మాణానికి సంబంధించిన నిధులను దారి మళ్లించడంపై మండిపడింది. కేంద్రానికి సంబంధించి ఎలాంటి నిధులైనా ముందుగా ఆయా రాష్ట్రాలు జీవోలు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి జీవోలను రిలీజ్ చేయకుండానే కేంద్రం మంజూరు చేసిన గృహ నిర్మాణ నిధులను ఖర్చు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు వందల కోట్లకు పైగా ఉండడాన్ని గమనించింది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించింది జగన్ రెడ్డి(YS Jagan) సర్కార్ కు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అన్ని రాష్ట్రాలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు కేంద్రం ఈ సంవత్సరం 2023కు గాను రూ. 3,084 కోట్లు విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి. కాగా రాష్ట్రం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం కోటిన్నర మాత్రమే ఉండడాన్ని గుర్తించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం, ఎలాంటి ముందస్తు సమాచారం లేక పోవడం, ఎలాంటి జీవో జారీ చేయక పోవడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా మరో షాక్ తగిలింది జగన్ ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 221 కోట్లు ఇవ్వక పోవడంతో కేంద్ర సర్కార్ రూ. 1,174 తన వాటా కింద ఇవ్వాల్సిన నిధులను నిలిపి వేసింది.
Also Read : PM Modi : కాంగ్రెస్ ఓ దోపిడీ దుకాణం – మోదీ