Kapil Sibal : ఫేక్ న్యూస్ ను కేంద్రం నిర్ణయిస్తుందా
అమిత్ షా ..కేంద్రంపై నిప్పులు చెరిగిన కపిల్ సిబల్
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. కేంద్రం కొత్తగా ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను తీసుకు రానుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఐటీ సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దీని వల్ల ఏది అసలైన వార్త ఏది కాదు అనేది తేలుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కేంద్రం ఫేక్ న్యూస్ ను గుర్తిస్తుందని పేర్కొన్నారు. దీనిపై సీరియస్ గా స్పందించారు కపిల్ సిబల్.
ఇప్పటికే రాచరిక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి సోషల్ మీడియా, ప్రచురణ, ప్రసార మాధ్యమాలు కంటగింపుగా మారాయని అందుకే ఫ్యాక్ట్ చెక్ పేరుతో కొత్త రకంగా ఆధిపత్యం చెలాయించాలని, ఉక్కు పాదం మోపాలని యత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు కపిల్ సిబల్. ప్రభుత్వం ఏది నకిలీదో ఏది కాదో నిర్ణయిస్తే ఇక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడదని నమ్మకం ఏంటి అని ప్రశ్నించారు.
ఇది పూర్తిగా కావాలని చేస్తున్న తంతుగా ఆయన అభివర్ణించారు. ఫేక్ న్యూస్ అంటే ఏమిటో కేంద్రం నిర్ణయిస్తుందా అని మండిపడ్డారు కపిల్ సిబల్. ఐటీ సవరణ నిబంధనల లోని నిజ నిర్ధారణ రూల్స్ పై కేంద్రాన్ని నిలదీశారు. ఒక రకంగా నిప్పులు చెరిగారు.