CEO Vikas Raj : రాష్ట్రమంతటా 144 సెక్షన్
స్పష్టం చేసిన సీఈవో వికాస్ రాజ్
CEO Vikas Raj : హైదరాబాద్ – ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. రాష్ట్రమంతటా 144వ సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు సీఈవో వికాస్ రాజ్(CEO Vikas Raj). సోషల్ మీడియాలో సైతం ఎన్నికల ప్రచారం చేయొద్దని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
CEO Vikas Raj Orders
ఓటు హక్కు లేని వాళ్లు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లి పోవాలని స్పష్టం చేశారు. 5 మంది కంటే ఎక్కువ మంది ఉంటే కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. డబ్బులతో, మద్యంతో ప్రభావితం చేసే పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు ఫెసిలిటేషన్ కేంద్రం కూడా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగిందన్నారు వికాస్ రాజ్. మాక్ పోలింగ్ ను తెల్ల వారు జామున నిర్వహిస్తారని వెల్లడించారు.
ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డులలో ఏదైనా ఒకటి తీసుకు రావాలని సూచించారు. ఓటర్లు ఫోన్ లను పోలింగ్ బూత్ లలోకి అనుమతిచ్చే ప్రసక్తి లేదన్నారు సిఇవో. ఇప్పటి వరకు రూ. 737 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు.
Also Read : Glenn Maxwell : అబ్బా మ్యాక్స్ వెల్ దెబ్బ