CEO Vikas Raj : ధైర్యంగా ఫిర్యాదు చేయండి – సిఇఓ
రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్
[CEO Vikas Raj : హైదరాబాద్ – ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమయంలో తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి సీరియస్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న వారిపై వేటు వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్కార్ ను ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు గాను నిధులు రిలీజ్ చేయొద్దంటూ ఆదేశించింది.
CEO Vikas Raj Comment
ఇదిలా ఉండగా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్(CEO Vikas Raj) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ ప్రత్యేకంగా ఓటర్ల కోసం యాప్ ను కూడా తీసుకు వచ్చినట్లు చెప్పారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినా లేదా ప్రలోభాలకు గురి చేసినా వెంటనే , నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఓటు అన్నది ఆయుధమని, దానిని సరిగా వినియోగించు కోవాలని సూచించారు వికాస్ రాజ్. ఎలాంటి అనుమానాలు కలిగినా లేదా నివృత్తి చేసు కోవాలని అనుకుంటే వెంటనే తమను సంప్రదించాలని కోరారు సిఈవో. యాప్ లోనే ఫిర్యాదు చేసిన వెంటనే కేవలం తక్కువ సమయంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : Chandra Babu Mulakat : బాబుతో ములాఖత్ ల కుదింపు