Weather Forecast AP TS : 19 నుంచి వర్షాలు కురిసే ఛాన్స్
వెల్లడించిన వాతావరణ శాఖ
Weather Forecast AP TS : అటు ఏపీలో ఇటు తెలంగాణలో వడగాడ్పులు దంచి కొడుతున్నాయి(Weather Forecast AP TS). ఈ సమయంలో పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా తెలంగాణలో దశాబ్ది ఉత్సవాల పేరుతో ఇప్పటికే బడులను స్టార్ట్ చేసింది. ఇక గత ఏడాది ఈపాటికే వర్షాలు దంచి కొట్టాయి.
కానీ ఈసారి వాన దేవుడు కరుణించడం లేదు. ఉక్క పోతతో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న తెలుగు వారికి తీపికబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈ మేరకు ఏపీలో ఈనెల 19 నుంచి 21 మధ్య రుతు పవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది.
19 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ , చిత్తూరు జిల్లాలలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం లేక పోలేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జూన్ 19 నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు వడగాడ్పులు ఇక ఉండవని, కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చని తెలిపింది. మొత్తంగా జనం ఊసురుమంటున్నారు. వాన దేవుడి కోసం వేచి చూస్తున్నారు.
Also Read : Tirumala Rush : పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట