Kodali Nani Chandrababu Lokesh : చంద్రబాబు 420 లోకేష్ 120
తండ్రీ కొడుకులు అవకాశవాదులు
Kodali Nani Chandrababu Lokesh : వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ లను ఏకి పారేశారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ పచ్చి అవకాశవాదులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు సభలు పెట్టినా , లోకేష్ పాదయాత్ర చేసినా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందని అన్నారు.
తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల కేంద్రం సైతం కితాబు ఇచ్చిందన్నారు. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నాడు నేడు దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసికట్టుగా వచ్చినా దమ్మున్న జగన్ రెడ్డిని ఢీకొనలేరంటూ స్పష్టం చేశారు.
పదవుల కోసం ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదన్నారు. ఏపీ సీఎంగా ఏం ఉద్దరించాడని ప్రశ్నించారు కొడాలి నాని(Kodali Nani) .
రాష్ట్రంలో వైసీపీకి ఇప్పటి దాకా చూస్తే 55 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. తమను ఓడించే సత్తా ఏ ఒక్కరికీ లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.
ఈసారి కూడా పవర్ లోకి వస్తామని, జగన్ రెడ్డి బతికి ఉన్నంత వరకు ఏపీకి ఆయనే సీఎం అని రాసి పెట్టు కోవాలని సవాల్ విసిరారు కొడాలి నాని.
Also Read : కళ్యాణ్ పై కొడాలి నాని కన్నెర్ర