Chandra Babu Case : చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా
ఈనెల 29కి వాయిదా వేసిన హైకోర్టు
Chandra Babu : అమరావతి – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. ఇసుక కేసు లోనూ బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ కూడా ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి దాకా అరెస్ట్ చేయవద్దంటూ ఇప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.
Chandra Babu Bail Hearing Postponed
ఇప్పటి వరకు జారీ చేసిన ఉత్తర్వులు ఈనెల 29, 30 వరకు ఆయా కేసులకు సంబంధించి వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ మొత్తం 8 కేసులు నమోదు చేసింది.
ప్రధానంగా ఏపీ స్కిల్ స్కామ్ , ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కామ్ తో పాటు తాజాగా మైనింగ్ జారీ చేసిన స్కామ్ కు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడుకు(Chandra Babu) ప్రమేయం ఉందంటూ ఆరోపించింది ఏపీ సీఐడీ.
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ కుంభకోణం కేసుకు సంబంధించి బాబు ఏకంగా 53 రోజులు రాజమండ్రి కేంద్ర కార్మాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న కంటి శస్త్ర చికిత్స చేయించు కోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. దీంతో పర్మినెంట్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Also Read : Supreme Court : జగన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్