Chandra Babu Case : బాబుకు ఊర‌ట విచార‌ణ వాయిదా

ఇన్న‌ర్ రింగ్ రోడ్డు బిగ్ స్కామ్ కేసు

Chandra Babu Case : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊర‌ట ల‌భించింది. గ‌తంలో పాల‌న‌లో ఉన్న కాలంలో ఎనిమిదికి పైగా కేసులు ఆయ‌న‌పై న‌మోదు చేసింది ఏపీ సీఐడీ.

Chandra Babu Case Postponed

తాజాగా ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ కేసులో బాబుకు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు పూర్త‌య్యాయి. ఇందులో భాగంగా కోర్టు లిఖిత పూర్వ‌క వాద‌న‌లు ఇవ్వాల‌ని ఏపీ హైకోర్టు ఇరువురికి సూచించింది.

చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu) త‌ర‌పున న్యాయ‌వాదులు లిఖిత పూర్వ‌క వాద‌న‌ల‌ను కోర్టులో దాఖ‌లు చేశారు. దీంతో కేసు విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా త‌న‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయించారంటూ ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న సుప్రీంకోర్టును కూడా ఆశ్ర‌యించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌దాని వెంట మ‌రో కేసు న‌మోదు చేసుకుంటూ పోయింది ఏపీ సీఐడీ. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన జ‌గ‌న్ త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారంటూ ఆరోపించారు బాబు.

Also Read : AP CID : లోకేష్ కు సీఐడీ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!