Chandra Babu Case : బాబు బెయిల్ పిటిష‌న్ వాయిదా

నిరాక‌రించిన కోర్టు జ‌డ్జి జ్యోతిర్మ‌యి

Chandra Babu Case : అమ‌రావ‌తి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది హైకోర్టు.

Chandra Babu Case Bail Updates

ఊహించ‌ని రీతిలో మ‌రోసారి చంద్ర‌బాబుకు షాక్ త‌గిలింది. కేసు విచార‌ణ చేప‌ట్టిన జ‌డ్జి జ‌స్టిస్ జ్యోతిర్మ‌యి చంద్ర‌బాబు నాయుడు కేసును విచారించేందుకు నిరాక‌రించారు. దీంతో ఈ కేసును అక్టోబ‌ర్ 30కి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

నాట్ బిఫోర్ మీ అని విచార‌ణ నుంచి త‌ప్పుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. త‌న‌కు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాల‌ని లేదా మ‌ధ్యంత‌ర బెయిల్ అయినా మంజూరు చేయాల‌ని దాఖ‌లు చేసిన పిటిష‌న్ లో కోరారు.

విచార‌ణ‌ను చంద్ర‌బాబు(Chandra Babu) కేసును హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ బెంచ్ కు కేసును బ‌దిలీ చేస్తున్న‌ట్లు హైకోర్టు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా ఒక్క స్కిల్ స్కాం కేసు కుకుండా అద‌నంగా మ‌రో రెండు కేసుల‌ను జోడించింది ఏపీ సీఐడీ. ఫైబ‌ర్ నెట్ కేసుకు సంబంధించి త‌న‌యుడు నారా లోకేష్ ను కూడా విచారించింది. ఆయ‌న‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ త‌ర్వాత వ‌దిలేసింది.

మొత్తంగా నారా చంద్ర‌బాబు నాయుడు జైలుకే ప‌రిమితం అయ్యేలా క‌నిపిస్తోంది. మ‌రో వైపు త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ లేఖ రాశారు.

Also Read : Eatala Rajender : న‌యా పైసా లేని పేదోడిని – ఈట‌ల‌

Leave A Reply

Your Email Id will not be published!