Chandra Babu Case : నేటితో ముగియ‌నున్న రిమాండ్

పొడిగిస్తారా లేక క్లోజ్ చేస్తారా

Chandra Babu Case : రాజ‌మండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ఏపీ సీఐడీ కేసులు న‌మోదు చేసింది. ఈ మేర‌కు రూ. 371 కోట్ల‌కు పైగా డ‌బ్బులు చేతులు మారాయ‌ని, ఇదంతా హ‌వాలా రూపంలో బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి బాబు అనుయాయుల జేబుల్లోకి వెళ్లింద‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

Chandra Babu Case Remand Updates

దీనికి సంబంధించి పూర్తి నివేదిక‌ను ఏపీ ఏసీబీ కోర్టుకు స‌మ‌ర్పించింది ఏపీ సీఐడీ. సుదీర్గ వాద‌న‌లు విన్న అనంత‌రం ఏసీబీ కోర్టు జ‌డ్జి హిమ బిందు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు నారా చంద్ర‌బాబు నాయుడుకు(Chandra Babu) అక్టోబ‌ర్ 19 వ‌ర‌కు రిమాండ్ విధించింది. దీంతో కోలుకోలేని దెబ్బ ప‌డింది బాబుకు . త‌న‌కు ఎదురే లేద‌ని, తాను స‌చ్చీలుడిన‌ని, త‌న‌కు 45 ఏళ్ల రాజ‌కీయ జీవితం ఉందంటూ ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చిన టీడీపీ చీఫ్ కు చుక్క‌లు చూపించింది ఏపీ సీఐడీ.

త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను ర‌ద్దు చేసింది ఏపీ హైకోర్టు. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా శుక్ర‌వారం దాకా తీర్పు రిజ‌ర్వ్ చేసింది. ఇక నేటితో చంద్ర‌బాబు నాయుడు రిమాండ్ ముగియ‌నుంది. దాదాపు జైలులో గ‌త నెల సెప్టెంబర్ 9 నుంచి ఉన్నారు. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తారా లేక జైలులోనే గ‌డుపుతారా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : TSRTC Lucky Draw : టీఎస్ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!