Chandra Babu Case : బాబు కేసుపై తీర్పు రిజర్వ్
సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు
Chandra Babu Case : న్యూఢిల్లీ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసుకు సంబంధించి తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానంలో విచారణ జరిగింది. ఇరువురి తరపున వాదనలు కొనసాగాయి.
Chandra Babu Case Updates
సుదీర్ఘ వాదనలు అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుకు(Chandra Babu) సంబంధించి ఏపీ స్కిల్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో.
విచారణ చేపట్టిన కోర్టు చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దాఖలు చేసిన పిటిషన్లను తోసి పుచ్చింది. దీంతో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ అక్టోబర్ 19 వరకు ఉంది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా ఇక్కడ కూడా ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Balineni Srinivas Reddy : ఖాకీల తీరుపై బాలినేని కన్నెర్ర