Chandra Babu Case : చంద్రబాబుకు చుక్కెదురు
సుప్రీంకోర్టులో దక్కని ఉపశమనం
Chandra Babu Case : న్యూఢిల్లీ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది.
దీంతో ఇన్నాళ్ల పాటు చక్రం తిప్పుతూ వచ్చిన చంద్రబాబుకు ఇది మింగుడు పడలేదు. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కస్టడీకి ఇస్తూ ఆదేశించింది.
Chandra Babu Case Postpone Updates
ఇదే సమయంలో తనకు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారించిన కోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదే కేసుకు సంబంధించి మంగళవారం తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. చివరికి చంద్రబాబు(Chandra Babu) బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. వచ్చే సోమవారానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
ఇదే సమయంలో హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లన్నింటిని తమకు సమర్పించాలని ఏపీ సీఐడీని ఆదేశించింది సుప్రీంకోర్టు.
Also Read : CEC Team Tour : రాష్ట్రానికి చేరుకున్న సీఈసీ బృందం