Chandra Babu Mulakat : బాబుతో ములాఖత్ ల కుదింపు
ఇతర ఖైదీలకు ఇబ్బందికరం
Chandra Babu Mulakat : రాజమండ్రి – జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా ఇరుక్కు పోయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా కుటుంబీకులకు, టీడీపీ నేతలకు బాబును కలిసేందుకు ఛాన్స్ ఇచ్చారు డీఐజీ.
Chandra Babu Mulakat Restrictions
ఇప్పటి వరకు కుటుంబీకులైన భార్య భువనేశ్వరి , కోడలు నారా బ్రాహ్మణి, కొడుకు నారా లోకేష్ తో పాటు టీడీపీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ , యనమల రామకృష్ణుడు, తదితరులు కలుసుకున్నారు.
తాజాగా ఈ ములాఖత్ ల పేరుతో ఎక్కువ మంది నేతలు రావడం వల్ల భద్రతా పరంగా, ప్రత్యేకించి ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.
ఇదిలా ఉండగా చంద్రబాబు(Chandra Babu) ములాఖత్ లపై అధికారులు కోత విధించారు. రోజుకు రెండింటికి మాత్రమే ఛాన్స్ ఉండగా ఒకటికి కుదించారు. సాధారణ ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , ఇదే విషయాన్ని వాళ్లు తమతో పంచుకున్నారని డీఐజీ తనను కలిసిన టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డీఐజీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పసుపు నేతలు.
Also Read : Police Sieze : భారీగా నోట్లు..బంగారం స్వాధీనం