Chandra Babu Naidu : బాబు బెయిల్ పిటిషన్ వాయిదా
ఏసీబో కోర్టు జడ్జి సెలవు కారణం
Chandra Babu Naidu : రాజమండ్రి – ఏపీ స్కిల్ డెవపల్మెంట్ కార్పొరేషన్ స్కిల్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. ఇదే సమయంలో రెండు రోజుల పాటు స్కిల్ స్కాం కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది.
Chandra Babu Naidu Case Viral
తొలి రోజు 7 గంటల పాటు విచారించగా రెండో రోజు ఏకంగా 14 గంటల పాటు విచారించింది నారా చంద్రబాబు నాయుడును(Chandra Babu Naidu). ప్రశ్నల వర్షం కురిపించినా తను నోరు విప్పలేదని, విచారణకు సహకరించ లేదని ఏపీ సీఐడీ పీపీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు.
ఇవాళ విచారణకు రావాల్సి ఉంది కేసు. ఏసీబీ కోర్టు జడ్జి మంగళవారం సెలవు పెట్టారు. దీంతో చంద్రబాబు నాయుడు కేసు విచారణను రేపటికి వాయిదా వేశారు.
Also Read : Asaduddin Owaisi : చంద్రబాబును నమ్మలేం – ఓవైసీ