Chandra Babu Naidu : రేపో ఎల్లుండో నన్ను అరెస్ట్ చేస్తారు
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
Chandra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. రేపో ఎల్లుండో తనను అరెస్ట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. బుధవారం చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu) మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో ఒకింత ఆందోళన రేగింది.
Chandra Babu Naidu Comments Viral
ఈ సందర్భంగా తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బతికానని చెప్పారు. కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ పవర్ లోకి వచ్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డి తనను ధైర్యంగా ఎదుర్కోలేక చవకబారు ప్రయత్నాలకు తెర తీశాడంటూ మండిపడ్డారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తనపై 22కి పైగా కేసులు నమోదు చేశారని, కానీ ఏ ఒక్క కేసును నిరూపించ లేక పోయారని స్పష్టం చేశారు. అయినా తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా తాను సీఎంగా ఉన్న సమయంలో అమరావతి రాజధానికి సంబంధించి రూ. 118 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై వైసీపీ మంత్రులు బాబు జైలుకు వెళ్లడం ఖాయమంటూ జోష్యం చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడిన మాటలు దేనికి సంకేతం అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Manikrao Thackeray : సీడబ్ల్యూసీ సమావేశం సక్సెస్ చేయాలి