Chandra Babu Naidu Congrats : కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ – బాబు </b.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభినందనలు
Chandra Babu Naidu : అమరావతి – తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై స్పందించారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రత్యేకించి అంతా తానై ముందుండి నడిపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కంగ్రాట్ అంటూ పేర్కొన్నారు.
Chandra Babu Naidu Congrats to Telangana Congress
ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. అన్ని పార్టీలను ఆదరించినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చ కూడదంటూ సూచించారు. హుందంగా అభినందనలు తెలియ చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu), నారా లోకేష్.
అంతే కాకుండా ఎన్నికలలో ఓటమి పాలైన వారిని చులకన చేయొద్దంటూ కోరారు. ఈ 40 ఏళ్ల కాలంలో మనం ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ వచ్చామని దీనిని గమనించాలని పేర్కొన్నారు.
Also Read : Bhatti Vikramarka : ప్రజా తీర్పు సుస్పష్టం – భట్టి