Chandra Babu Naidu : జగన్ వల్లనే పడకేసిన ప్రాజెక్టులు
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు ఫైర్
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సాగు నీటి రంగానికి పట్టిన శని జగన్ మోహన్ రెడ్డి అని ఆరోపించారు. తన స్వార్థం , తన పగ తప్పితే రాష్ట్ర అభివృద్ది గురించి, రైతు అవసరం గురంచి జగన్ ఏ మాత్రం ఆలోచించ లేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఇలా పడకేశాయని వాపోయారు చంద్రబాబు నాయుడు.
Chandra Babu Naidu Comments
గత నాలుగు సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. ఒక్క ఎకరాకు కూడా సాగు నీటి వసతి కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు గేట్ల నిర్వహణ లేదన్నారు. కాలువల్లో పూడిక తీయలేదని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). జీవ నాడి పోలవరాన్ని జీవం లేకుడా చేశారని ఆరోపించారు. సాగునీటి రంగానికి ఇంత ద్రోహం చేసిన జగన్ ను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు.
ప్రశ్నించిన టీడీపీ నేతలపై కుట్రలు, దాడులు, అక్రమ కేసులు నమోదు చేయించడం మంచి పద్దతి కాదన్నారు. ధైర్యం అనేది నీకు ఉంటే సాగు నీటి విధ్వంసంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో జగన్ రెడ్డికి బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు టీడీపీ చీఫ్. ఎన్ని కేసులు నమోదు చేసినా బెదిరే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొన్నారు.
Also Read : Minister KTR : రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన వ్యాధి