Chandra Babu Naidu : పరిటాల రవి నిత్య చైతన్య దీప్తి
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
Chandra Babu Naidu : మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా టీడీపీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్రబాబు నివాళులు అర్పించారు. తన జీవితాంతం పేదల కోసం పని చేశాడని కొనియాడారు. ఫ్యాక్షన్ పీడిత ప్రజలకు స్వేచ్ఛను అందించాలని అలుపెరుగని పోరాటం చేశాడని ప్రశంసించారు నారా చంద్రబాబు నాయుడు.
Chandra Babu Naidu Words about Paritala Ravindra
తన ప్రాణాలను పణంగా పెట్టిన అరుదైన నాయకుడు అని పేర్కొన్నారు. అభ్యుదయ వాదిగా, ప్రజల హృదయాలలో నిత్యం వెలిగే చైతన్య జ్యోతిగా వెలుగొందాడని ప్రశంసించారు. తన జీవిత కాలమంతా పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి గురించి పదే పదే ఆలోచించాడని తెలిపారు.
ఇలాంటి నాయకులు అరుదుగా పుడుతుంటారని, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పరిటాల రవీంద్ర చేసిన సేవలు ఎన్నదగినవని అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu). కరువు గట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలను ఎదుర్కొన్నాడు. దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచాడు. ఆపై పేదలకు అండగా నిలిచాడు. వారి పక్షాన తన గొంతుకను వినిపించాడని ప్రశంసించారు టీడీపీ చీఫ్. ఎల్లప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంత కాలం పరిటాల రవీంద్ర బతికే ఉంటారని స్పష్టం చేశారు.
Also Read : Temjen Imna Along : సానుకూల దృక్పథం సంతోషానికి మార్గం