Chandra Babu Naidu : మిత్రమా ఎలా ఉన్నావు
కేసీఆర్ కు చంద్రబాబు పరామర్శ
Chandra Babu Naidu : హైదరాబాద్ – చాలా కాలం తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు. కానీ ఒకరు ఆస్పత్రిలో ఉంటే మరొకరు కార్య రంగంలోకి దూకారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు నిన్నటి దాకా తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్ , గతంలో ఏపీకి సీఎంగా వ్యవహరించిన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu Naidu).
Chandra Babu Naidu Met KCR
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నకేసీఆర్ ఉన్నట్టుండి బాత్రూంలో జారి పడ్డారు. దీంతో ఆయన తుంటి విరిగింది. పడి పోయిన ఆయనను హుటా హుటిన హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేపట్టారు.
తుంటి విరిగిందని శస్త్ర చికిత్స చేయాలని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు కల్వకుంట్ల కుటుంబం. పరీక్షలు చేసిన అనంతరం కేసీఆర్ కు ఆపరేషన్ చేయడం, అది పూర్తిగా సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ఆయన నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తను కోలుకుని , తిరిగి యధావిధిగా నడిచేందుకు కొంత సమయం పడుతుందని , ఆ మేరకు ఆరు వారాలైనా విశ్రాంతి కావాలని యశోద యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తమ పార్టీకి చెందిన వారే కాకుండా సీనీ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.
Also Read : CM Revanth Reddy : డ్రగ్స్ పై సీఎం ఉక్కుపాదం