Chandra Babu Remand : చంద్రబాబుకు బిగ్ షాక్
ఏసీబీ కోర్టు రిమాండ్ పొడగింపు
Chandra Babu Remand : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని విచారణను ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు చెప్పింది ఏసీబీ కోర్టు.
Chandra Babu Remand Extended
ఇదిలా ఉండగా స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు చేతులు మారాయని నమోదైన కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడును(Chandrababu Naidu) సుదీర్ఘంగా విచారించింది. శనివారం 7 గంటలకు పైగా విచారించింది. 120 ప్రశ్నలు సంధించింది.
రెండో రోజు ఆదివారం 14 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తూ వచ్చే నెల అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే జైలులో ఉన్న ఆయన మరో 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. విచారణ ముగియడంతో వర్చువల్ గా న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి చంద్రబాబును పలు ప్రశ్నలు అడిగారు. సీఐడీ ఆఫీసర్స్ గైడ్ లైన్స్ పాటించారా లేదా. మీపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా అన్న దానికి లేదన్నారు బాబు.
Also Read : Bandi Sanjay : కేసీఆర్ పాలనలో తెలంగాణ లూటీ