Chandra Shekar Azad : కేసీఆర్ కు ప‌రామ‌ర్శ‌ల ప‌రంప‌ర‌

ఆరోగ్యంపై ఆరా తీసిన ప్ర‌ముఖులు

Chandra Shekar Azad : హైద‌రాబాద్ – భీమ్ పార్టీ జాతీయ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ సీఎం కేసీఆర్ ను ప‌రామ‌ర్శించారు. య‌శోద ఆస్ప‌త్రికి చేరుకున్నారు. యూపీ నుంచి నేరుగా హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ఆయ‌న‌కు కేసీఆర్ హెల్త్ గురించి వాక‌బు చేశారు. ఆజాద్(Chandra Shekar Azad) కు మాజీ మంత్రి కేటీఆర్, కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత వివ‌రించారు.

Chandra Shekar Azad Met KCR

మ‌రో వైపు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు క్యూ క‌ట్టారు. సినీ, వ్యాపార‌, రాజ‌కీయ రంగాల‌కు చెందిన వారు ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇదిలా ఉండ‌గా ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ లో జారి ప‌డ‌డంతో కేసీఆర్ తుంటి విరిగింది. ప‌డి పోయిన ఆయ‌న‌ను హుటా హుటిన హైద‌రాబాద్ లోని సోమాజిగూడ య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్ష‌లు చేప‌ట్టారు.

తుంటి విరిగింద‌ని శ‌స్త్ర చికిత్స చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. అయితే ఎలాంటి ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు కల్వ‌కుంట్ల కుటుంబం. ప‌రీక్ష‌లు చేసిన అనంత‌రం కేసీఆర్ కు ఆప‌రేష‌న్ చేయ‌డం, అది పూర్తిగా స‌క్సెస్ కావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Bhatti Vikramarka : కోలుకుంటారు తిరిగి వ‌స్తారు

Leave A Reply

Your Email Id will not be published!