Minister Ramprasad Reddy: మంత్రి భార్య దురుసు ప్రవర్తనపై సీఎం చంద్రబాబు సీరియస్ !
మంత్రి భార్య దురుసు ప్రవర్తనపై సీఎం చంద్రబాబు సీరియస్ !
Minister Ramprasad Reddy: పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రితో పాటు భార్యగా తనకు ఎస్కార్ట్ ఉండాలంటూ పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు. అంతేకాదు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు.
Minister Ramprasad Reddy Wife..
పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేసారు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులను దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.
Also Read : CM Chandrababu Naidu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ !