Chandrababu Arrest Protest : ఏపీలో టెన్షన్ టెన్షన్
రాష్ట్ర మంతటా బస్సులు బంద్
Chandrababu Arrest Protest : ఆంధ్రప్రదేశ్ – ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ లో ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో శనివారం నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆయనను ఏ1గా చేర్చారంటూ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Chandrababu Arrest Protest Viral
డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర మంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Arrest Protest) అరెస్ట్ చేయడంతో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు, నాయకులు ఆందోళనలు, నిరసనలకు దిగారు.
ఏపీ వ్యాప్తంగా టీడీపీ సీనియర్లు, నాయకులు, కార్యకర్తలను ముందు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అగ్ర నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. విశాఖలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా తన అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు. ఏది ఏమైనా ధర్మం, న్యాయం గెలుస్తుందన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.
తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఈ సందర్బంగా స్పష్టం చేసింది ఏపీ సీఐడీ పోలీసులు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు అరెస్ట్ చేస్తున్నామంటూ ప్రకటించారు. దీంతో చంద్రబాబు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు.
Also Read : Chandrababu Naidu Tests : చంద్రబాబుకు వైద్య పరీక్షలు