Chandrababu Case : బాబు క్వాష్ పిటిషన్ పై విచారణ
తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు
Chandrababu Case : న్యూఢిల్లీ – టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈనెల 19 వరకు ఖైదీగా ఉండనున్నారు.
Chandrababu Case Updates
ఇప్పటికే ఏపీ సీఐడీ ఏపీ స్కిల్ స్కాం కేసులో రూ. 371 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది. దీంతో పాటు ఏపీలో ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాంలలో కూడా చంద్రబాబు నాయుడు(Chandrababu) పాత్ర ఉందంటూ పేర్కొంది. ఈ మేరకు పూర్తి నివేదికను ఏసీబీ కోర్టులో సమర్పించింది. కోర్టు రిమాండ్ విధించింది.
ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేసును కొట్టి వేయాలని ఏసీబీ కరో్టు రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టారు.
ఈ కేసుకు సంబంధించి జస్టిస్ అనిరుధ్ బోస్ , జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసనం ముందు ఇవాళ మరోసారి వాదనలు వినిపించనున్నారు.
Also Read : Kodi Katti Case : కోడి కత్తి కేసుపై విచారణ