Chandrababu Case : బాబుకు ఊరట విచారణ వాయిదా
ఫైబర్ నెట్ కేసులో సుప్రీం తీర్పు
Chandrababu : న్యూఢిల్లీ – ఏపీ టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. ఇప్పటికే ఆయనపై 8 కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ. ఆయనపై ఫైబర్ నెట్ , స్కిల్ స్కాం , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ , మైనింగ్ , తదితర కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో స్కిల్ స్కాం కేసుకు సంబంధించి 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు. పర్మినెంట్ బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు.
Chandrababu Case Hearing Postponed
ఇదిలా ఉండగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు తనయుడు నారా లోకేష్ ను కూడా చేర్చింది ఏపీ సీఐడీ. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. దీనిని సవాల్ చేస్తూ చంద్రబాబు(Chandrababu) తరపు లాయర్లు ఢిల్లీలోని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఇదే కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం డిసెంబర్ 12వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
అప్పటి వరకు ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ స్పష్టం చేసింది. కేసు విచారణను జస్టిస్ అనిరుధ్ బోస్ , జస్టిస్ బేలా ఎం. త్రివేది లతో కూడిన బెంచ్ చేపట్టింది.
Also Read : Telanagana Polling Day : బారులు తీరిన ఓటర్లు