Chandrababu Case : బాబుకు షాక్ మరో కేసు నమోదు
ఫిర్యాదు చేసిన ఏపీఎండీసీ
Chandrababu Case : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. బయటకు వచ్చిన సంతోషం ఏ మాత్రం ఉండడం లేదు. భారీ కాన్వాయ్ తో రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయనకు షాక్ తగిలింది. ప్రస్తుతం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
Chandrababu Cases Updates
ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, అనుమతి తీసుకోకుండా భారీ ర్యాలీ చేపట్టారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వెంటనే కేసు నమోదు చేయాలంటూ ఆదేశించింది.
దీంతో చంద్రబాబు నాయుడుతో(Chandrababu) పాటు టీడీపీకి చెందిన పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీ స్కిల్ స్కాం కేసుతో పాటు ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాంతో పాటు తాజాగా మరో కేసు కూడా నమోదైంది.
బాబు హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఏపీఎండీసీ ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది చంద్రబాబు నాయుడిపై. ఈ కేసులో బాబును ఏ2గా చేర్చింది. ఏ1గా పీతల సుజాత, ఏ3గా చింతమనేని, ఏ4గా దేవినేని ఉమను చేర్చింది.
Also Read : Mynampally Hanumantha Rao : మల్లారెడ్డి ఓ బఫూన్