Chandrababu Case : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట కల్పించిన సుప్రీంకోర్టు

2022లో, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని...

Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తునకు బెయిల్ చెల్లుతుందని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసును విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ దర్యాప్తుపై ప్రభావం చూపదని పేర్కొంది. చంద్రబాబు(Chandrababu) విచారణకు సహకరించకుంటే, ఆయన బెయిల్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సిఫార్సు చేసింది. ప్రభుత్వం కోరిన విధంగా చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై జారీ చేసిన ఆదేశం చంద్రబాబుకు కూడా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది.

Chandrababu Case Updates

2022లో, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని… చాలా మంది ముందస్తు బెయిల్‌పై ఆధారపడుతున్నారని.. చంద్రబాబుకు బెయిల్ మాత్రమే ఎందుకు రద్దు చేయాలనీ కోర్టు ప్రశ్నించింది. చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గతేడాది సెప్టెంబర్‌లో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 12న అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అవకతవకల్లో చంద్రబాబు పేరు చేర్చింది. ఆ తర్వాత చంద్రబాబుపై దాఖలైన పలు కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా, దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Also Read : AP Govt : స్పీకర్ తమ్మినేనిని కలిసి వివరణ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు

Leave A Reply

Your Email Id will not be published!