Chandrababu Khaidi No 7691 : చంద్ర‌బాబు ఖైదీ నెంబ‌ర్ 7691

కేటాయించిన రాజ‌మండ్రి జైలు

Chandrababu Khaidi No 7691 : రాజమండ్రి – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ లో రూ. 371 కోట్లు చేతులు మారాయని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేర‌కు అరెస్ట్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా ముడుపులు ముట్టాయ‌ని అదుపులోకి తీసుకుంది.

Chandrababu Khaidi No 7691 Viral

ఏసీబీ కోర్టులో 25 పేజీల రిమాండ్ రిపోర్ట్ స‌మ‌ర్పించింది. సుదీర్ఘ వాద‌న‌ల అనంత‌రం ఏసీబీ కోర్టు జ‌డ్జి హిమ బిందు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. చంద్ర‌బాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది.

దేశ వ్యాప్తంగా ఈ తీర్పు క‌ల‌క‌లం సృష్టించింది. ఈ తీర్పు వెలువ‌రించిన జ‌డ్జి ఎవ‌రు అనేది వెత‌క‌డం మొద‌లైంది. ఇదిలా ఉండ‌గా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి సిద్దార్థ్ లూత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అత్యంత భ‌ద్ర‌త క‌లిగిన నారా చంద్ర‌బాబు నాయుడును(Chandrababu) జైలులో ఎలా ఉంచుతారంటూ ప్ర‌శ్నించారు.

సోమ‌వారం ఆయ‌న బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అంతే కాదు చంద్ర‌బాబుకు ప్రాణ హాని ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబ‌ర్ 10న ఆదివారం అర్ద‌రాత్రి 2.30 గంట‌ల‌కు విజ‌య‌వాడ నుండి రాజ‌మండ్రి లోని సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు.

చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌త్యేక గ‌ది కేటాయించారు. ఆయ‌న‌కు ఖైదీ నెంబ‌ర్ 7691 ను కేటాయించారు.

Also Read : RK Roja Selvamani : బోగ‌స్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!