Chandrababu Naidu : విజయవాడకు బాబు తరలింపు
నంద్యాలలో టెన్షన్ టెన్షన్
Chandrababu Naidu : నంద్యాల – స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆర్కే ఫంక్షన్ హాలులో బస చేసిన చంద్రబాబును అరెస్ట్ చేశారు.
Chandrababu Naidu Arrested
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు టీడీపీ చీఫ్. తనను అక్రమంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu). పక్కా ప్రూఫ్స్ తోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు సీఐడీ పోలీసులు.
2015లో స్కిల్ డెవలప్ మెంట్ – సీమెన్స్ ప్రాజెక్టు వెలుగు చూసింది. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఆనాడు పాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ. 3,356 కోట్లు . సర్కార్ వాటా కింద 10 శాతంగా చెల్లిస్తుందని పేర్కొంది.
ఇందులో 10 శాతం కింద రూ. 371 కోట్లు దారి మళ్లాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పవర్ లోకి వచ్చిన వైసీపీ జగన్ సర్కార్ 2020లో ఆగస్టులో విచారణకు ఆదేశించారు.
ఇదిలా ఉండగా సీమెన్ కంపెనీ తాము ఎవరితోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేసింది. 2021న ఏసీబీ విచారణ చేపట్టింది. సీఐడీ వాస్తవమని తేల్చింది.
Also Read : Chandrababu Naidu Arrest : చంద్రబాబు నాయుడు అరెస్ట్