Chandrababu Naidu Case : చంద్రబాబుపై కేసు నమోదు
ప్రాజెక్టు సందర్శన సందర్భంగా అల్లర్లు
Chandrababu Naidu Case : తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఏపీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్ ను చేర్చారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్లులో టీడీపీ కార్యకర్తలు, నేతలు, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
Chandrababu Naidu Case Viral
హత్యా యత్నం, నేర పూరిత కుట్రల కింద ముదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేశాయని, తమ హయాంలో 24 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని కానీ జగన్ రెడ్డి హయాంలో కేవలంల 12 వందల కోట్లు మాత్రమే కేటాయించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు , నిలదీశారు నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులకు తాము ఎలా నష్ట పోయామో చెప్పేందుకు ప్రాజెక్టుల సందర్శన పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. అంగళ్లులో పెద్ద ఎత్తున దాడులు , అల్లర్లు చోటు చేసుకున్నాయి. చివరకు పోలీసులపై కూడా దాడులకు దిగారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Gruha Lakshmi Scheme : గృహలక్ష్మికి డెడ్ లైన్ లేదు