Chandrababu Naidu : ఏసీబీ కోర్టులో చంద్రబాబు
కొనసాగుతున్న వాదనలు
Chandrababu Naidu : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో టీడీపీ చీప్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ విచారించింది. అనంతరం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టుకు ఆదివారం చంద్రబాబును తరలించారు.
Chandrababu Naidu in ACB Court
కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రధానంగా 409 సెక్షన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. సరైన సాక్ష్యాలు చూపకుండా ఎలా నమోదు చేస్తారంటూ చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu) తరపున న్యాయవాది సిద్దార్థ్ లూత్రా వాదించారు.
ఏసీబీ కోర్టు ప్రాంగణంతో పాటు పరిసరాలు పూర్తిగా క్రిక్కిరిసి పోయాయి. దీంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఇరువురి తరపున కేవలం 15 మంది చొప్పున మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏపీ సీఐడి తన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు నాయుడును ప్రధాన సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది.
ఆయన సీఎం హోదాను అడ్డం పెట్టుకుని నేరానికి పాల్పడ్డారంటూ తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను, ఆధారాలను కూడా సమర్పించింది. స్కిల్ స్కామ్ అంతా చంద్రబాబు కనుసన్నలలోనే చోటు చేసుకుందన్నారు. ఈ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడతో పాటు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ కు కూడా ప్రమేయం ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు.
Also Read : Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు