Chandrababu Naidu : ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఈమధ్యన తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. విజన్ 2040 పేరుతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ సందర్బంగా తనకు ఉన్న విజన్ ఏమిటో స్పష్టం చేశారు.
Chandrababu Naidu About Education
ఈ క్రమంలో తన కొడుకు నారా లోకేష్ ను ఇంజనీర్ ను చేయాలని అనుకున్నానని చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నోరు జారారు. ఇంజనీరింగ్ చేయాలంటే ఇంటర్ లో బైపీసీ చేయాలని అన్నారు. అక్కడ హాజరైన వారంతా ప్రత్యేకించి యువత విస్తు పోయారు. 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడటం ఏమిటి అని తమలో తాము చర్చించుకున్నారు.
విజన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజన్ లేకుండా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో తన వల్లనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని అన్నారు. నేను లేక పోతే ఈ సిటీ ఇంత డెవలప్ అయ్యేది కాదన్నారు. ఇదే సమయంలో మరో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పంగ చెప్పంగ విని మీరంతా టెక్నాలజీలో నెంబర్ 1 అయ్యారంటూ పేర్కొన్నారు.
Also Read : Janasena Comment : పవన్ ఫోకస్ వారాహి సక్సెస్