Chandrababu Naidu : నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు

నారా చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu : నంద్యాల – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కీం స్కామ్ లో కీల‌క పాత్ర పోషించారంటూ ఏపీ సీఐడీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్బంగా నంద్యాల‌లో చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.

Chandrababu Naidu Comment

త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు. ఎక్క‌డైనా ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటే అరెస్ట్ చేస్తార‌ని, కానీ ఏపీ సీఐడీ పోలీసులు దీనికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు.

చివ‌ర‌కు న్యాయం, ధ‌ర్మ‌మే గెలుస్తుంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని న‌డి రోడ్డుపై హ‌త్య చేశారంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుంటే త‌ట్టుకోలేక త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేశారంటూ వాపోయారు.

నేను న్యాయ బ‌ద్దంగా పోరాడేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దేవుడు నీకు బుద్ది చెబుతాడంటూ పేర్కొన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఎఫ్ఐఆర్ కాపీలు కావాల‌ని కోరినా ఇప్ప‌టి దాకా ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా నారా చంద్ర‌బాబు నాయుడిని నంద్యాల నుంచి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. మేజిస్ట్రేట్ ఇంటి ముందు హాజ‌రు ప‌ర్చ‌నున్నారు.

Also Read : Chandrababu Naidu : విజ‌య‌వాడ‌కు బాబు త‌ర‌లింపు

Leave A Reply

Your Email Id will not be published!