Chandrababu Naidu : ఇక రానున్నది టీడీపీ పాలనే – బాబు
జగన్ రాచరిక పాలనకు మంగళం తప్పదు
Chandrababu Naidu : ఏపీలో ఇక రాబోయేది తెలుగుదేశం పార్టీనేనని జోష్యం చెప్పారు ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). రాజమండ్రి లోని వేదగిరిలో ఏర్పాటు చేసిన టీడీపీ మహానాడులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక ఎంత మాత్రం సైకో రెడ్డిని భరించే పరిస్థితుల్లో లేరన్నారు. మార్పు తథ్యమని ఇక టీడీపీ పవర్ లోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
లక్షలాది మంది హాజరై మహానాడును విజయవంతం చేశారని, ఈ జోష్ ఇలాగే ఎన్నికలు వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలన్నారు. ఈ సందర్బంగా పలు వరాల జల్లులు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఈసారి మహిళలు, యువత, రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేశారు. ఈ సందర్బంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనికి భవిష్యత్తుకు గ్యారెంటీ అని పేరు పెట్టారు. పేదలకు ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ప్రకటించారు.
హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు. జగన్ ప్రభుత్వం సభ సక్సెస్ కాకుండా అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కానీ ప్రజలు ఏపీ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారని అన్నారు చంద్రబాబు నాయుడు.
Also Read : TDP Manifesto