Chandrababu Naidu : చంద్రబాబు సూత్రధారి..పాత్రధారి
ఏపీ స్కిల్ స్కామ్ పై ఏపీ సీఐడీ
Chandrababu Naidu : విజయవాడ – ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై పెద్ద ఎత్తున అభియోగాలు మోపింది ఏపీ సీఐడీ. తన హయాంలో ఏర్పాటు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించింది.
Chandrababu Naidu Accused CID Said
పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నిన్న నంద్యాలలో ఉన్న చంద్రబాబును(Chandrababu Naidu) అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి నేరుగా కంచనపల్లికి తరలించింది . సీఐడీ విచారించింది. 20 ప్రశ్నలు సంధించింది. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
అక్కడి నుంచి విజయవాడ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టుకు తరలించారు. ఈ సందర్బంగా ఏపీ సీఐడీ తరపున లాయర్లు , చంద్రబాబు తరపున వెంకటేశ్వర్ రావు, సిద్దార్థ్ లూత్రా వాదనలు వినిపించారు.
ప్రధానంగా 409 సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు బాబు తరపు లాయర్ లూత్రా. పూర్తి ఆధారాలు, వివరాలతో రిమాండ్ రిపోర్టు కోర్టులో సమర్పించింది. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడి పేరు చేర్చింది. బాబు నేర పూరిత కుట్రకు పాల్పడ్డారని.
Also Read : Pawan Kalyan : భారీ భద్రత మధ్య పవన్ తరలింపు