Chandrababu Naidu Modi : మోదీతో చంద్ర‌బాబు ములాఖ‌త్

మాజీ సీఎంతో పీఎం కీల‌క భేటీ

Chandrababu Naidu Modi : చాన్నాళ్ల త‌ర్వాత ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పీఎం న‌రేంద్ర మోదీ(Chandrababu Naidu Modi)తో క‌లుసు కోవ‌డం ఆస‌క్తిని రేపింది. జి20 ప్రిప‌రేష‌న్ మీట్ కు సీఎంలతో పాటు బాబు కూడా హాజ‌ర‌య్యారు. జి20 గ్రూప్ కు భార‌త దేశం నాయ‌క‌త్వం వ‌హించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు నాయుడు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీని అభినందించారు. ఏపీకి ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించినా తాము సిద్దంగా ఉన్నామ‌ని సీఎం జ‌గ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. యావ‌త్ ప్ర‌పంచం భార‌త దేశం వైపు చూస్తోంద‌న్నారు. ఈ విష‌యంలో అంద‌రూ ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

రాజ‌కీయ పార్టీల మ‌ధ్య విభేదాలు స‌ర్వ సాధార‌ణ‌మ‌ని , స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసేందుకు కృషి చేయాల‌ని కోరారు చంద్ర‌బాబు నాయుడు. భ‌విష్య‌త్ త‌రాల‌కు డిజిట‌ల్ ప‌రిజ్ఞానంపై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు మోదీకి. రాబోయే 25 ఏళ్ల‌కు విజ‌న్ డాక్యుమెంట్ ను త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు టీడీపీ చీఫ్‌. డిజిట‌ల్ టెక్నాల‌జీ దేశానికి మ‌రింత బ‌లం చేకూర్చేలా చేస్తుంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు..

దేశంలో బ‌ల‌మైన , యువ జ‌నాభా ఉంద‌ని ఆయ‌న అన్నారు. వారి ల‌క్ష్యాల‌ను సాధించేలా ప్రోత్సాహించాల్సిన అవస‌రం ఉంద‌ని చెప్పారు. యువ‌త‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే విధంగా విధానాలు రూపొందించాల‌ని సూచించారు. అప్పుడే అభివృద్ది అన్న‌ది సాధ్యం అవుతుంద‌ని చెప్పారు మాజీ సీఎం.

మాన‌వ వ‌న‌రుల‌ను నాలెడ్జ్ ఎకాన‌మీతో అనుసంధానించ‌డం ద్వారానే ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌గల‌మ‌ని అన్నారు. యువ‌తే కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : నియ‌మిస్తాం కానీ తొల‌గించం

Leave A Reply

Your Email Id will not be published!