Chandrababu Naidu : మోదీ నువ్వు తోపు – చంద్ర‌బాబు

నూత‌న పార్ల‌మెంట్ గ‌ర్వ‌కారణం

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న హ‌యాంలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం నిర్మాణం పూర్తి చేసుకోవ‌డం, మే 28న ప్రారంభం కానుండ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్బంగా మోదీ చేసిన ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu).

ప్ర‌పంచం యావ‌త్తు నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం చూసి విస్తు పోవ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. కేంద్ర స‌ర్కార్ చారిత్రాత్మ‌క నిర్మాణం చేప‌ట్ట‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు టీడీపీ చీఫ్‌. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ప‌రివ‌ర్త‌న విధానానికి , కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకునేందుకు నిల‌యంగా మారాల‌ని పిలుపునిచ్చారు.

ప‌రిపూర్ణ‌మైన ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక‌గా భార‌త దేశం ఉంద‌ని ఇది ప్ర‌తి ఒక్క భార‌తీయుడు గ‌ర్వించాల‌ని స్ప‌ష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2047 నాటికి స్వాతంత్రం వ‌చ్చి 100 ఏళ్లు పూర్త‌వుతాయ‌ని, ఆనాటి వ‌ర‌కు పేద‌రికం లేని, పేద‌లు లేని భార‌త దేశం కావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. మొత్తంగా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ జ‌త క‌ట్టిన చంద్ర‌బాబు ఈసారి త‌న స్వ‌రాన్ని మార్చుకోవ‌డం విశేషం.

Also Read : Arvind Kejriwal PM Modi

Leave A Reply

Your Email Id will not be published!