Chandrababu Naidu : నేను నిప్పును ఎవరికీ భయపడను
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : నంద్యాల – ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ లో కీలక సూత్రధారి, పాత్రధారి టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును శనివారం నంద్యాలలో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను నిప్పు లాంటి వాడినని, తాను ఎవరికీ భయపడనంటూ హెచ్చరించారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. చివరకు న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేదన్నారు.
Chandrababu Naidu Words
ఎప్పుడైతే ఏపీలో జగన్ రెడ్డి సీఎంగా కొలువు తీరాక తనను టార్గెట్ చేయడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను ఎంతో మందిని తాను చూశానని చెప్పారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తనపై గత కొన్నేళ్లుగా ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయని , కానీ ఇప్పటి వరకు ఎవరూ నిరూపించ లేక పోయారని అన్నారు. ఎందుకంటే తాను నిప్పులా బతికానని చెప్పారు. చివరి క్షణం వరకు తెలుగు వారి బాగు కోసం ప్రయత్నం చేస్తూ వచ్చానని అన్నారు.
అభివృద్ది జపం తప్ప తనకు ఇంకేమీ తెలియదన్నారు. ప్రజల గురించి పోరాడుతున్నందుకే తనను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇవి ఏవీ తనను ప్రజల నుండి వేరు చేయలేవని అన్నారు చంద్రబాబు నాయుడు. దేశంలో కోర్టులు ఉన్నాయని, వాటిలోనే తాను తేల్చుకుంటానని ప్రకటించారు. ప్రజలు, నేతలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
Also Read : Chandrababu Naidu Tests : చంద్రబాబుకు వైద్య పరీక్షలు