Chandrababu Naidu : ఎఫ్ఐఆర్‌లో నా పేరు లేదు
నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : నంద్యాల – టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి ఏపీ సీఐడీ నంద్యాలలో అరెస్ట్ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భారీ ఎత్తున కోట్లు చేతులు మారాయంటూ , అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి.
Chandrababu Naidu Arrest in Nandyala
ఈ సందర్భంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని(Chandrababu) నిందితుడిగా చేర్చింది సీబీఐ. ఈ సందర్బంగా అరెస్ట్ చేస్తున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని నిలదీశారు చంద్రబాబు నాయుడు. తమ వద్ద తగినంత ఆధారాలు ఉన్నాయని, వీటన్నింటిని హైకోర్టుకు కూడా అందజేశామని స్పష్టంచేశారు పోలీసులు. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉన్నాయని జవాబు ఇచ్చారు. విజయవాడకు తీసుకు వెళ్లే లోపు అన్ని వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు.
ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు తన తండ్రిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నారా లోకేష్ ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు.
Also Read : Chandrababu Naidu : విజయవాడకు బాబు తరలింపు